కుప్పం,ఆగస్టు 07 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వి. అర్చన హై జంప్, లాంగ్ జంప్, కె. దర్శిని 400, 100 మీటర్స్ రన్నింగ్ రస్, జి. సుచిత్ర 100, 200 మీటర్స్ పరుగు పందెం, ఆర్. చందన షాట్ పుట్, డిస్క్ త్రో, వి.నందిని లాంగ్ జంప్, ఎస్ సురక్ష షార్ట్ పుట్, జి.ఎస్ మౌనిష్, జావేలిస్ త్రో, షాట్ పుట్ మొదలైన క్రీడ, చిత్తూరు జిల్లా మొసానికల్ మైదానంలో జరిగిన జిల్లా అథ్లెంటిక్స్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఈ నెల ఆగస్టు 11, 12,13 న తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెంటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. విద్యతోపాటు క్రీడాల్లో రాణిస్తున్న విద్యార్థిని విద్యార్థులను కళాశాల వైస్ చైర్మన్ సాగర్ రాజ్ అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు తర్పీదు ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ సుధాకర్ ను కళాశాల ప్రిన్సిపాల్ డి.సుధారాణి అభినందించారు.
రాష్ట్ర స్థాయి అథ్లెంటిక్స్ పోటీలకు ఎంపికైన కేడీసీ విద్యార్థులు
RELATED ARTICLES
