తండ్రి మరణం జ్ఞాపకాలు మరువక ముందే కుమారుడు తిరుగురాని లోకాలకు
బైరెడ్డిపల్లిలో నెలకొన్న విషాద ఛాయలు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై28
మండల కేంద్రమైన బైరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాధిక్ అలీ మంగళవారం ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతకు గురికావడం చోటుచేసుకుంది.
సాధిక్ అలీ బైరెడ్డిపల్లి గ్రామ పంచాయితీలో సుదీర్ఘకాలం కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులను చేపట్టి,అనంతరం రెగ్యులర్ ఉద్యోగిగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వీకోట గ్రామ పంచాయితీలో 2024 సెప్టెంబర్ నుండి నేటి వరకు కూడా విధులను నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం విధులను ముగించుకొని బైరెడ్డిపల్లి లోని నివాసానికి ద్విచక్ర వాహనంలో
వస్తున్న తరుణంలో బైరెడ్డిపల్లి మండలంలోని దేవదొడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి నుండి వీకోట వైపు వెళ్తున్న కంటైనర్ (ఏసీ …ఈచర్) సాధిక్ వాహనాన్ని డీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో కుడి కాలు వేరుకాబడి కొంత దూరం రహదారి పై పాదం పడింది. ఈచర్ (వాహనం) డ్రైవర్ సంఘటన చోటుచేసుకొన్న వెంటనే సంఘటన స్థలం నుండి పరార్ కావడం జరిగింది. వివరాలు అందుకున్న 108 వాహనం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని,బాధితుణ్ణి చికిత్సల నిమిత్తం కొరకు పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో నొప్పికి తట్టుకోలేక మృతి చెందినట్టు 108 సిబ్బంది పేర్కొన్నారు.
