వేము ఇంజనీరింగ్ కళాశాలలో ధైర్యశక్తి కార్యక్రమం
—చిత్తూరుఅడ్మినిస్ట్రేటివ్ఎస్పీ రాజశేఖర్ రాజు
పూతలపట్టు ఆగస్టు 17 (గరుడదాత్రిన్యూస్) యువత తమ సమస్యలను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులతో స్వేచ్ఛ పంచుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపాడు. పూతలపట్టు మండలం వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అటానమస్) లో సోమవారంయువతమహిళలు,బాలికల్లోఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం, శారీరక సామర్థ్యం స్వీయ రక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు *“ధైర్య శక్తి – Shield for the Next Gen” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని Women Empowerment & Grievance Redressal Cell ఆధ్వర్యంలో, Suri 8 TVచొరవతోఈకార్యక్రమాన్నినిర్వహించారు.మహిళలు, బాలికలకు ఉచిత స్వీయ రక్షణ శిక్షణ అందించడంతో పాటు, వారు ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీ మాట్లాడుతూ చెప్పుకోకుండా మనసులోనే దాచుకుంటే ఒత్తిడిలు పెరిగి చెడు స్నేహాలు తప్పుడు నిర్ణయాలు దారితీసే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం జనరేషన్ మొబైల్ ఫోన్లో వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని సాంకేతికతను అవసరానికి అనుగుణంగా బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలన్నారు పిల్లలు అడిగిన ప్రతిదీ కొనిచ్చినప్పుడే తల్లిదండ్రులు మంచివారిని భావించకూడదని తల్లిదండ్రులు విధించే కొన్ని పరిమితులు వారి భవిష్యత్తు కోసం మంచిని కోరుకునే ఉద్దేశంతోనే ఉంటాయని సంతోషం ఎప్పుడూ అభివృద్ధికి దారి తీయాలి కానీ వికాసానికి కాదని జీవితంలో ఏ విషయంలోనైనా అతిగా వ్యవహరించడం మంచిది కాదని సమతుల్యతతో ముందుకు సాగాలని సైబర్ నేరాలు ఆన్లైన్ సమస్యలు ఎదురైనప్పుడు సైబర్ క్రైమ్ విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని యువతకు భరోసా ఇచ్చాడు.పూతలపట్టు సీఐ తిమ్మయ్య మాట్లాడుతూ, శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం, మైండ్ ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ నైపుణ్యాలను నేర్చుకుని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా మనలో “నేను సాధించగలను” అనే ధైర్యం ఉండాలనితెలిపాడు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. నవీన్ కిలారి మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో విద్యతో పాటు మానసిక దృఢత్వం, శారీరక దృఢత్వం, స్వీయ రక్షణ మరియు వ్యక్తిత్వ వికాసం కూడా కీలకమని పేర్కొన్నారు. మహిళల భద్రత, సాధికారత మరియు సమస్యల పరిష్కారానికి కళాశాలలోని Women Empowerment & Grievance Redressal Cell నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
Suri 8 TV చొరవతో చేపట్టిన “Dhairya Shakti – Shield for the Next Gen” కార్యక్రమం ద్వారా మహిళలు, బాలికలకు ఉచిత స్వీయ రక్షణ శిక్షణ అందించడం అభినందనీయమని కళాశాల యాజమాన్యం పేర్కొంది. మహిళలు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ముందుకు సాగితే “Empowered Women – Stronger Society – Safer Tomorrow” అనే లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో
సూరి 8 టీవీ చైర్మన్ సురేష్ ధైర్య శక్తి ప్రోగ్రాం డైరెక్టర్ కీర్తి దళవాయి. యోధా మార్షల్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు ఎంఏ సతీష్ యోధ. కళాశాల యాజమాన్యం, ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రీవెన్స్ సెల్ సభ్యులు అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొని స్వీయ రక్షణ శిక్షణ, మానసిక దృఢత్వం, మహిళా సాధికారత, సైబర్ భద్రత వ్యక్తిగత భద్రతపై కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
