ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సంపద కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీవో, ఎమ్మార్వో

సంపద కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీవో, ఎమ్మార్వో

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు జూలై 05 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం కారూరు గ్రామపంచాయతీ పరిధిలోని సంపద కేంద్రాన్ని ఎంపీడీవో మహమ్మద్ రఫీ, తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు సంయుక్తంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సంపద కేంద్రానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అధికారులు, పూర్తి వివరాలను ఆర్డీవోకు నివేదించి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేలా, న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం కారూరు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి నిర్వహణ, మౌలిక సదుపాయాలు, పిల్లలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!