ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సరదా సరదాగా 45 సంవత్సరాల తర్వాత కలయిక

సరదా సరదాగా 45 సంవత్సరాల తర్వాత కలయిక

📰 Generate e-Paper Clip

డైట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
కార్వేటి నగరం: జూలై 12. గరుడ దాత్రి న్యూస్
కార్వేటి నగరంలోని 1981-1982 వ సంవత్సరం బ్యాచ్ టిటిసి విద్యార్థు లు దాదాపుగా 45 సంవత్సరాల తర్వాత జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ నందు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమునకు చంగల్ రాయలు అధ్యక్షత వహించారు. ఈ బ్యాచ్ లో అనారోగ్యంతో మృతి చెందిన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.తొలుత ఇంచార్జ్ ప్రిన్సిపాల్ దామోదరం రావు డైట్ లొ చేరిన ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడ క్రమశిక్షణతో కూడిన విద్య అందుతుందన్నారు., ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. బాలసుబ్రమణ్యం రాజు మాట్లాడుతూ సరదా సరదాగా పుల్లయ్య ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావ్ అని అడిగి తెలుసుకోవడం జరిగింది. చంగల్ రాయులు మాట్లాడుతూ కార్వేటినగరం డైట్ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిందని, ఇక్కడ చదువుకున్న వారందరూ ఉపాధ్యాయులుగా, కొందరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేశారని పేర్కొన్నారు. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ డైట్ లో చదువుకోవడం ఓ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అలాగే ఇన్ని రోజుల తర్వాత కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చిన్ననాటి స్మృతులను గుర్తు చేసు కోవడం జరిగిందన్నారు. సాయంత్రం వరకు ఆటల పాటలతో సరదాగా గడిపారు. అనంతరం డైట్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ దామోదర్ రావు, అధ్యాపకులు రాజ్ కుమార్, దశరధుడు, శైలజ రాణి, భోగ సేన, తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, చంద్రశేఖర్, సిద్దయ్య, వనజ, విమల, ప్రసాద్, చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల నుండి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!