ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసీఈసీ తీరుకు వ్యతిరేకంగా ఎస్.ఈ.సి. కార్యాలయం ముట్టడి - హోరెత్తిన కాంగ్రెస్ శ్రేణులు

సీఈసీ తీరుకు వ్యతిరేకంగా ఎస్.ఈ.సి. కార్యాలయం ముట్టడి – హోరెత్తిన కాంగ్రెస్ శ్రేణులు

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి న్యూస్ :
సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు

సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (CEC) జ్ఞానేశ్వర్ రావు SIR ప్రక్రియ పేరుతో సొంత అజెండాతో వ్యవహరిస్తూ, ఎలక్షన్ కమిషనర్ల సలహాలు, సూచనలు తీసుకోకుండా అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి, వర్కింగ్ ప్రెసిడెంట్ జెడి శీలం ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ (SEC) కార్యాలయ ముట్టడి కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాల గురవం బాబు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాకు చెందిన ఏడు నియోజకవర్గాల ఇన్చార్జులు, నాయకులు పాల్గొన్నారు.ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డి. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ చైర్మన్ దాసరి రత్నం, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ తలపా దామోదర్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నంబాకం హరికృష్ణ, జిల్లా కిసాన్ అధ్యక్షులు జోగి వినోద్, సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యదర్శి బొగ్గుల సురేష్, సూళ్లూరుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్వేతా రాణి, దొరవారిసత్రం మండల మహిళా అధ్యక్షులు చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
CEC తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!