ePaper
Sunday, October 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసీఎం చంద్రబాబు గృహంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

సీఎం చంద్రబాబు గృహంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

📰 Generate e-Paper Clip

చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్):కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సీఎం నివాసంలో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో అమరావతిలో భేటీ అయ్యారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో, రాష్ట్రంలో అమలువుతున్న గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకున్న కేంద్రమంత్రి కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!