* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
* నేతలతో టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వారంలోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందనన్నారు. తీర్పు రాగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తెలిపారు. ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినా, పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులదేనని పేర్కొంటూ, ప్రజల్లో సానుకూలత ఉన్న వారినే ఎంపిక చేయాలని, ఇందుకోసం ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పార్టీల వారీగా శాతాల లెక్కలు కాకుండా ఎవరికి ఎక్కడ బలం ఉందో చూసి పోటీ చేయాలన్నారు. మిత్రపక్షాలతో సమన్వయం పాటిస్తూ నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
