ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హల్ద్వానీ ర్యాలీ వేదిక శుద్ధికరణను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్

హల్ద్వానీ ర్యాలీ వేదిక శుద్ధికరణను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్

📰 Generate e-Paper Clip

ఖర్గే గారి సభా వేదికను గంగాజలంతో కడిగారు – ఇది కులవివక్ష: బాలగురవం బాబు

సూళ్ళూరుపేట ఆగస్టు 14 గరుడధాత్రి :
ఆగస్టు 8వ తేదీన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రాంలీలా గ్రౌండ్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడిన వేదికను, ఆగస్టు 13న సభ ముగిసిన తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గంగాజలంతో శుద్ధి చేసి కుల వివక్షత చూపారని కాంగ్రెస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు తీవ్రంగా ఖండించారు.గురువారం సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్&బి బంగ్లా నుండి బస్టాండ్ ఆవరణలోని గాంధీ విగ్రహం మరియు అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బాలగురవం బాబు మాట్లాడుతూ, అణగారిన వర్గాల కోసం డా.బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే, ఆ రాజ్యాంగాన్నే బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కి కుల వివక్షత చూపిస్తోందని మండిపడ్డారు.ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు దళితుల ఓట్లు మాత్రమే కావాలని, దళితులకు అన్యాయం జరిగితే మాత్రం ప్రశ్నించడం లేదని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి *నారా చంద్రబాబు నాయుడు*, ఉప ముఖ్యమంత్రి *పవన్ కళ్యాణ్* భారతదేశంలో కుల వివక్షత జరుగుతుంటే మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని, తిరుపతి జిల్లాలో గాని ఎక్కడైనా దళితులపై కుల వివక్షత జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదని, ఎంతవరకైనా పోరాడతామని బాలగురవం బాబు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ తపాల దామోదర్ రెడ్డి తిరుపతి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నంబాకం హరికృష్ణ, జిల్లా జనరల్ సెక్రెటరీ గండవరం రమేష్ రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరీముల్లా, జిల్లా వైస్ ప్రెసిడెంట్ దేవదానం, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు జోగి వినోద్, జిల్లా కార్యదర్శి గోపి జిల్లా కార్యదర్శి ఇళయరాజా, సూళ్లూరుపేట సూళ్లూరుపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆవల రమణ, దొరవరసత్రం మండలం మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి, సూళ్లూరుపేట టౌన్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి సూళ్లూరుపేట మండల ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోరిడి సుబ్రహ్మణ్యం సూళ్లూరుపేట టౌన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రవీణ్, శ్రీకాళహస్తి మండల ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితర శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!