ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిచ్చాటూరులో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

పిచ్చాటూరులో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, ఆగస్టు 14 గరుడధాత్రి:

పిచ్చాటూరు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు డీఈవో అధికారులు ఖాళీలను ప్రకటించారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. హేమమాలిని తెలిపారు.

ఖాళీలు ఇలా ఉన్నాయి:

– MPS సిద్దిరాజు కండ్రిగ – 1 SGT
– MPS వెంగళత్తూర్ – 1 SGT
– ZPHS పులింగుంట – 1 SA-BS

విద్యార్హతలు:

– SGT: ఇంటర్మీడియట్‌తో పాటు D.Ed అర్హత ఉండాలి.
– SA-BS: డిగ్రీతో పాటు B.Ed అర్హత ఉండాలి.

అభ్యర్థులు అప్లికేషన్ సమర్పించే విధానం, దరఖాస్తు చేసుకునే తేదీలకు సంబంధించిన వివరాలను అనుసరించి నిర్దేశిత సమయంలో సంబంధిత పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ అవకాశాన్ని అర్హత కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పిచ్చాటూరు మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. హేమమాలిని కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!