కార్వేటినగరం జూలై 12 గరుడ దాద్రి న్యూస్
కార్వేటినగరం మండలం కోటార వేడు పంచాయతీ కనకపురం అభివృద్ధి ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించి 400 లీ. నాటు సారా ఊట ధ్వంసం చేసినట్లు ఎస్సై తేజస్విని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎవరైనా నాటు సారా తయారు చేసిన విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా నాటు సారా తయారు చేస్తుంటే సమాచారం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
400 లీటర్ల నాటు సారా ఊట ద్వంసం
RELATED ARTICLES
