ePaper
Wednesday, June 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

📰 Generate e-Paper Clip

నారాయణవనం జూన్ 15 (గరుడధాత్రి న్యూస్) గ్రీవెన్స్ డే ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. సోమవారం నారాయణవనం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆదిమూలం, జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ భీముని చెరువులో పాఠశాల గదులను నిర్మాణానికి సంబంధించిన అసంపూర్తిగా నిలిచిపోవడం పట్ల16 లక్షల రూపాయలు మంజూరు చేయాలని జడ్పి సీఈవో రవి నాయుడు ని ఫోన్ ద్వారా కోరారు. ఇంటి స్థలాలు కొత్తగా ఇండ్లు మంజూరు కాకుండా ఉన్న నిరుపేద ప్రజలు అందించిన వినతిపత్రం పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే వారికి ఇంటి స్థలాలు ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ప్రధానంగా త్రాగునీటి సమస్యను పరిష్కరించి గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించకుండా పారిశుద్ధ పనులను చేపట్టాలని, విద్యుత్ దీపాలు మురికినీటి కాలువల సమస్యలపై అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఏరుకంబట్టు రోడ్డును మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని, తిరువట్యం, పాలమంగళం కాజ్వే మరమత్తు పనులకు నిధులు మంజూరు సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ సమస్యలపై కలెక్టర్ తీసుకెళ్లి త్వరలో తాసిల్దార్ ఎంపీడీవో ప్రజా ప్రతినిధులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!