ePaper
Wednesday, June 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్లారీ డ్రైవర్ కుమార్తెకు ట్రిపుల్ ఐటీ సీటు

లారీ డ్రైవర్ కుమార్తెకు ట్రిపుల్ ఐటీ సీటు

📰 Generate e-Paper Clip

సత్యవేడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని డి.నివేద ఘనత

సత్యవేడు మండల కేంద్రంలోని జీహెచ్‌ఎస్ (GHS) గర్ల్స్ ప్లస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.నివేద ప్రతిష్టాత్మక ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (IIIT) లో సీటు సాధించింది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ డి. సుబ్రమణ్యం, గృహిణి డి.మేఘల కుమార్తె అయిన నివేద.. సత్తి వేడు ప్రభుత్వ వసతి గృహంలో బసచేస్తూ జిహెచ్ఎస్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంది.ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలలో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఈ మార్కుల ఆధారంగానే ఆమెకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఉచితంగా సీటు లభించింది.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ,ఎంతో క్రమశిక్షణతో చదివి ప్రభుత్వ పాఠశాల స్థాయిని నివేద పెంచిందని ప్రధానోపాధ్యాయురాలు భారతి కొనియాడారు. లారీ డ్రైవర్ కూతురైనప్పటికీ పట్టుదలతో చదివి ట్రిపుల్ ఐటీ సీటు సాధించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిద్ధాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ నివేదకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!