పలమనేరు, జూన్ 18 ( గరుడ ధాత్రి ) : గంగవరం మండలంలోని మేలుమాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివి ఇటీవల 10వ తరగతిలో 600 మార్కులకు గాను 573 మార్కులు సాధించి త్రిపుల్ ఐటీ లో సీటు పొందిన అర్చనకు గ్రామస్తులు పాఠశాల ఆవరణలో గురువారం ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మేలుమాయి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు అర్చనను దుస్సాలువతో సన్మానించి పండ్లబొకేను అందజేశారు. మేలుమాయి గ్రామానికే చెందిన మహేష్ అర్చనకు రూ 5116/- లను అందజేశారు. అలాగే గ్రామ వాస్తవ్యులు అమర్నాథ్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహుకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. విద్యార్థులు అర్చనను చూసి ప్రేరణ పొంది ఇలాగే పై స్థాయికి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసులు , రమేష్ రెడ్డి, చెంగారెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
మేలుమాయి విద్యార్థిని అర్చనకు గ్రామస్థులచే ఘన సన్మానం
RELATED ARTICLES
