బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్18
మండలకేంద్రం బైరెడ్డిపల్లి లోని పుంగనూరు రహదారిలో గురువారం ఒక ద్విచక్రవాహనం ను బోలోరో వాహనం డేకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం ఎదురుగా జరిగింది. ఈ ప్రమాదం లో ద్విచక్రవాహనంను మదనపల్లి నుండి మధురైకు అలనేరేడు లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొన్నది.ద్విచక్ర వాహన చోదకుడు స్థానికుడు నజీర్ సాహెబ్ (74) కాలు విరిగి అస్వస్థతకు గురయ్యాడు. అస్వస్థతకు గురైన క్షతగాత్రున్ని 108 సహాయంతో ప్రధమ చికిత్స అందించి చిత్తూరు చీలా పల్లి సిఎంసి కు తరలించడం జరిగినది. బైరెడ్డిపల్లి పోలీసు వారు వాహనాన్ని, డ్రైవర్ గంగాధర్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.
