బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్18
సంచార అర్థసంచారా జాతుల కు
డి ఎన్ టి.,ఎన్. టి.” సర్టిఫికెట్ల జారీ చేయడం వలన విముక్తి జాతుల వారు గా గుర్తించడం వలన సంచార అర్ధ సంచార జాతులకు, విద్య ,ఉద్యోగ ,సామాజిక, రాజకీయ, ఆర్థికంగా ఎదుగుదలకుతోడ్పడుతుంది అని చిత్తూరు జిల్లా సంచారజాతుల యువజన అధ్యక్షుడు ఎస్.కృష్ణమూర్తి,బైరెడ్డిపల్లి మండల ప్రెసిడెంట్ మహేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరములు అయినా, ఎన్ని ప్రభుత్వా లు వచ్చినా కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు, సంచార అర్ధ సంచారకులాలకు సమన్యాయ పాలన జరగలేదు. అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయినాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మండలాల్లోనూ మీ సేవ కేంద్రాల్లో వంశరాజ్ బి,సి.ఏ. సీరియల్ నెంబర్18, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్న ఇవ్వకా వేర్వేరు కులతవీకరణ పత్రాలు అందజేస్తున్నారు,
ఈ విషయమై మండల తహసీల్దార్ కూ విన్నవించుకున్న ఫలితం నేటికి దక్కలేదన్నారు.ఇకనైనా అధికారులు బైరెడ్డిపల్లి, శాంతిపురం,రామకుప్పం మండలాల్లో
వంశ రాజ్ బి సి ఏ గా కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలని, సంచార అర్ధ సంచార కులాల బైరెడ్డిపల్లి మండల ప్రెసిడెంట్ మహేష్ కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో కోట్రేపల్లి ఉమామహేశ్వర్,
ఎం. కొత్తూరు అనికెర వెంకటరమణ మరియు సంచర అర్థసంచారజతుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సంచార జాతులకు ఎన్ టి డి ఎన్ టి కుల సర్టిఫికెట్లను జారీ చేయాలి
RELATED ARTICLES
