ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికుప్పం నియోజకవర్గ ఏపీజేఎఫ్ అధ్యక్షుడిగా అస్గర్ ఏకగ్రీవ ఎన్నిక

కుప్పం నియోజకవర్గ ఏపీజేఎఫ్ అధ్యక్షుడిగా అస్గర్ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

.
* జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా- అస్గర్.
కుప్పం,జులై 23 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) నూతన కార్యవర్గాన్ని గురువారం జరిగిన నియోజకవర్గ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.అనంతరం నూతన కమిటీని వారు ప్రకటించారు.
నియోజకవర్గ ఏపిజెఎఫ్ అధ్యక్షుడిగా అస్గర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సయ్యద్ ఉమ్మర్, లక్ష్మీనారాయణ,లను ప్రధాన కార్యదర్శిగా భూపతి, కోశాధికారిగా దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాసుల రెడ్డి, కృష్ణంరాజు, శివా రాయల్, మురళిలను ఎన్నుకున్నారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా కే.ఎన్. ప్రసాద్, నాగరాజు, గోకుల్ కుమార్, మణి, సలహాదారులుగా మహదేవన్, రజనీకాంత్, కమిటీ సభ్యులుగా తేజ, పవన్, కిరణ్, ప్రభాకర్‌లను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అస్గర్ మాట్లాడుతూ,తమపై ఉంచిన నమ్మకానికి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు, వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. సంఘం అభివృద్ధికి ప్రతి సభ్యుడు సహకరించాలని ఆయన కోరారు. అంతకు ముందు ఏపీజేఎఫ్ సభ్యులందరూ ఇటీవల దుండగుల చేతిలో హత్య గావింప బడ్డ సహచర పాత్రికేయుడు వి కోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!