ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

* క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్.
* రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఎన్‌టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఏరియా ఆసుపత్రి, రామచంద్ర రోడ్, కొత్తపేటలో సమీక్ష.
కుప్పం,జులై 25 (గరుడ ధాత్రి న్యూస్):రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా కుప్పం ప్రాంతంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడం, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడం లక్ష్యంగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ శనివారం పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి సంబంధిత పనులను పరిశీలించారు.కుప్పం రూరల్ మండలం వెండుగంపల్లి గ్రామంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సందర్శించారు. హబ్ ఇన్‌చార్జ్‌లు, అధికారులతో సమావేశమై ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల నియమితులైన నలుగురు ఆర్‌టీఐహెచ్ వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశమై హబ్ లక్ష్యాలు, బాధ్యతలు, యువ పారిశ్రామికవేత్తలకు అందించాల్సిన మార్గదర్శకత్వం గురించి వివరించారు.
ఈ సందర్భంగా వికాస్ మర్మట్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌పై ఎంతో నమ్మకం ఉంచారని, కొత్త ఆలోచనలు ఉన్న యువతకు సరైన మార్గనిర్దేశం చేసి వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం హబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వినూత్న ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని వ్యాపారంగా ఎలా మలచాలో తెలియని యువతకు ప్రతి దశలో మార్గదర్శకత్వం, మెంటారింగ్, శిక్షణ మరియు అవసరమైన సహకారం అందించాలని వాలంటీర్లకు సూచించారు.అనంతరం నిర్మాణంలో ఉన్న ఎన్‌టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. కాంప్లెక్స్ వద్ధ రహదారి విషయంలో ఉన్న సమస్యను పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించారు. ఆ సమస్యను రేపటిలోగా పరిష్కరించి రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.తదుపరి కుప్పం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కడ ప్రాజెక్ట్ డైరెక్టర్, ‘వన్ స్టాప్ సొల్యూషన్’ కేంద్రం కోసం కొత్త భవనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో అనువైన స్థలాన్ని గుర్తించి, కొత్త భవన నిర్మాణానికి అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.ఆ తర్వాత కుప్పం పట్టణంలోని రామచంద్ర రోడ్డులో పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైనేజీ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకున్న అనంతరం, సంబంధిత అధికారులకు వెంటనే శాశ్వత పరిష్కారం చూపించి పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం కొత్తపేట ప్రాంతంలో పీజీఆర్‌ఎస్‌లో అందిన రోడ్డు సమస్యపై పరిశీలన నిర్వహించారు. రోడ్డు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత శాఖ అధికారులకు వారం రోజుల్లోగా సమస్యను పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని అధికారులను కఠినంగా హెచ్చరిస్తూ, నిర్దేశించిన గడువులో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వికాస్ మర్మట్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా కేంద్రిత పాలనకు అనుగుణంగా ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వేగంగా పరిష్కరించడం కడ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన ప్రభుత్వ సేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!