పలమనేరు జూలై 28 (గరుడ ధాత్రి) :
పలమనేర్ పట్టణం లో శారదా ఇంగ్లీష్ మీడియం, సాయి మేథా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు యాజమాన్యం సహకారంతో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో కిషోర బాల బాలికలకుబాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా మంగళ వారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు సిడిపిఓ ఉమారాణి, ఎంఈఓ లీలారాణి, మెడికల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి, గిరిధర్ మూర్తి, వన్ స్టాప్ కౌన్సిలర్ హరిప్రియ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారిని ఆదేశాల మేరకు పట్టణములో కొత్తపేట జడ్పీ ఉర్దు హైస్కూల్ నందు ఇన్చార్జి హెడ్మాస్టర్ అలియా అధ్యక్షతన బాల్య వివాహాలపై ప్రత్యేకమైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. సమాజంలో బాల్య వివాహాలు చేసుకోవడం వలన బాలికలకు గర్భాధారణ సమస్య రోజుకు రోజుకు పెరుగుతున్నదని దాని వలన బాలిక చిన్న వయసులోనే అనారోగ్యనికి గురై క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నివారణ చర్యల్లో భాగంగా ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించింది అని తెలిపారు. అభం శుభం తెలియని చిన్నారులపై రోజురోజుకు లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని వాటిని అరి కట్టాలంటే ప్రధానంగా ప్రజలు చైతన్యం కావాల్సి ఉందన్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడం, ఆత్మహత్యలు నివారణ చర్యలపై హాజరైన వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జీవిత ప్రయాణంలో కష్టాలు, అపజయాలను అధిగమించాలంటే ప్రతి మనిషికి ధైర్యం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. అదే విధంగా పిల్లలు చిన్నతనము నుండే మాదకద్రవ్యాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచి భవిష్యత్తు ఉంటుందని పిలుపునిచ్చారు. విలాసాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలని, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు పోక్సో చట్టాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నదని దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ క్రమంలో నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ శివ, మహిళ సంరక్షణ కార్యదర్శి సుజాత, అంగనవాడి టీచర్ చిలకమ్మ, ఏఎన్ఎం అనిలా ఆశా వర్కర్లు, కిషోర్ బాల బాలికలు పాల్గొన్నారు.
కిశోర బాల బాలికలకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
RELATED ARTICLES
