ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హనుమంతపురంలో ఎంపీడీవో మహమ్మద్ రఫీ పర్యటన

హనుమంతపురంలో ఎంపీడీవో మహమ్మద్ రఫీ పర్యటన

📰 Generate e-Paper Clip

-అర్హులకు పెన్షన్ల పంపిణీ… చెత్త నుంచి సంపద కేంద్రం పరిశీలన

పిచ్చాటూరు, ఆగస్టు 1 గరుడధాత్రి :

పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో శనివారం ఎంపీడీవో మహమ్మద్ రఫీ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త వ్యర్థాల నుంచి సంపద తయారీ కేంద్రం ను పరిశీలించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి నిర్వహించాల్సిన విధానంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను విడదీసి ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామ పరిశుభ్రత మెరుగుపడుతుందని వివరించారు.
గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఎంపీడీవో, పరిశుభ్రమైన గ్రామ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ ప్రజలు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!