ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రిపాలు తాగిస్తే తల్లి బిడ్డ ఆరోగ్యం

పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రిపాలు తాగిస్తే తల్లి బిడ్డ ఆరోగ్యం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 1 (గరుడదాద్రి న్యూస్):
గర్భం దాల్చిన ప్రతి మహిళ కాన్పు అయిన వెంటనే బిడ్డకు ముర్రిపాలు తాగిస్తే తల్లి బిడ్డ ఆరోగ్యం వంతులుగా ఉంటారని మండల వైద్యాధికారి హేమశ్రీ అన్నారు. కార్వేటి నగరం మండలం కత్తిరి పల్లి పంచాయతీలో ఉన్న మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాలు వారోత్సవాలపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వైద్యాధికారి మాట్లాడుతూ తల్లిపాలు తాగడం వల్ల ఉపయోగాలు వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రిపాలు తాగించడం వల్ల బిడ్డ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. బిడ్డకు రెండు సంవత్సరాలకు తల్లిపాలు తాగించాలన్నారు. తల్లి మంచి ఆహారాన్ని తీసుకోవాలన్నారు. బిడ్డకు తల్లిపాలు ఏ విధంగా పాలు ఇవ్వాలా అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ రోజా రమణి ,వైద్య సిబ్బంది సి హెచ్ ఓ రాజేశ్వరి, పీహెచ్ఎన్ గౌరీ సిబ్బంది పుష్పవతి వరలక్ష్మి లావణ్య సుధాకర్, అంగన్వాడీ కార్యకర్తలు సుగుణ విమల మమత రాజేశ్వరి కృష్ణకుమారి మనీలా శాంతి భాగ్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!