రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి జర్నలిస్టులకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది
కోట (గూడూరు) ఆగస్టు 2 (గరుడ ధాత్రి న్యూస్)
శ్రీ పొట్టి శ్రీరాములు
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం లో ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి సతీష్ పై నోరు పారేసుకున్న రూరల్ సీఐ కిషోర్ బాబు తీరు పై గూడూరు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జర్నలిస్టులు అగ్రహం వ్యక్తం చేస్తూఆదివారం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టి రోడ్డు పై బైటయించి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా రూరల్ సీఐ కిషోర్ బాబు రాజ్యాంగం హక్కులను ఉల్లంఘిస్తున్నారని బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహం కు అర్జీ ఇచ్చి జర్నలిస్టులు నిరసన తెలిపారు.
సీఐ కిషోర్ బాబు డౌన్ డౌన్,”We Want Justice” (మాకు న్యాయం కావాలి),రూరల్ సీఐ క్షమాపణలు చెప్పాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరేతించారు.ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు మీజూరు మల్లికార్జున రావు, రఘులుమాట్లాడుతూ..ఎలక్ట్రానిక్ రిపోర్టర్ సతీష్ పై బూతు పురాణం రూరల్ సీఐ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు జర్నలిస్టుపైఅవమానకరంగా మాట్లాడిన రూరల్ సీఐ కిషోర్ పై చర్యలు తీసుకోవాలి. సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన అధికారులే జర్నలిస్టుల ను బూతులు తిట్టడం న్యాయమా…అంటూ వారు ప్రశ్నించారు.
కోట నార్త్ గిరిజన కాలనీ లో ఓ మహిళ పై పెట్రోల్ దాడి జరిగి గూడూరు ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ సతీష్ మరికొందరు వెళ్లి వివరణ తీసుకోని ఛానెల్ లో ప్రచురణ చేస్తే అది ఎదో పెద్ద తప్పుగా భావించిన రూరల్ సీఐ కిషోర్ బాబు10 పాస్ గాని ఎదవలు గొట్టాలు పట్టుకొని వస్తారు పనికి మాలినా కొడుకులు అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి జర్నలిస్టులకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది. జర్నలిస్టులు తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నా జర్నలిస్టుల పై బహిరంగా అసభ్య పదజాలంతో దుషించడం తగదు అన్నారు. రూరల్ సీఐ తీరు పై గూడూరు జర్నలిస్ట్ లు నిరసనలు చేపట్టాం వెంటనే రూరల్ సీఐ కిషోర్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదంటే జిల్లా ఎస్పీ కి పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా ఈ విషయాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్ట్ సతీష్ పై అమానుషంగా తిట్టడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృత్తమైతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని జర్నలిస్టులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
