సదుం, గరుడ ధాత్రి ఆగస్టు 2
సదుం నాయన పాకాల కొత్తగా నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా మురుగునీటి కాలువలు నిర్మించి తర్వాత రోడ్డు వేయాలని మండల వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వైసీపీ నాయకులు సదుం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయన పాకాల మార్గంలో కూటమి నాయకులు ఇరుపక్కల డ్రైనేజీలు నిర్మించకుండా హడావుడిగా రోడ్డు వేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే ఈ మార్గంలో స్థిర నివాసం ఉన్నవారు మాత్రం తమకు మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసిన తర్వాతే రోడ్డు వేయాలని కోరుతున్నారని చెప్పారు. మురుగునీటి కాలువలు వేయకుండా రోడ్లు పనులు చేస్తే అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు వినతిపత్రం(ఫిర్యాదు) లో పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి సోమశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు సయ్యద్ భాష, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, ఖాజాఫీర్, కమ్రుద్దీన్, మాజీ ఉపసర్పంచ్ బాబు రెడ్డి, రమేష్ బాబు, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
మురుగు కాలువలు నిర్మించి రోడ్డు వేయాలి
RELATED ARTICLES
