ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కారు బోల్తా- ఇద్దరు మృతి

కారు బోల్తా- ఇద్దరు మృతి

📰 Generate e-Paper Clip

-ఒకరికి తీవ్ర గాయాలు

వీకోట గరుడదాత్రి న్యూస్ ఆగస్టు 4

బెంగళూరు– చెన్నై నైస్ రోడ్డు నందు కారు బోల్తా పడిన ఘటనలో అక్కా చెల్లెలు మృతిచెందగా భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన జరిగింది. బెంగళూరు నుండి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి, అతని భార్య మానస, మరదలుగౌతమి టియాగో కారు నందు సొంత ఊరికి బయలుదేరారు. బట్ర హళ్లి వద్ద పరంధామ రెడ్డి, జ్ఞానేంద్ర అనే ఇద్దరు ప్రయాణికులు ఈ కారులోనే బయలుదేరారు. వీకోట మండలం రామాపురం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపుతప్పి ఐదు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో గౌతమి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా మానస ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వాహనాన్ని నడుపుతున్న అనిల్ కుమార్ రెడ్డి కుడి చెయ్యి విరిగిపోగా తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. బట్ర హళ్లి నందులిఫ్ట్ తీసుకున్న పరంధామ రెడ్డి, జ్ఞానేంద్ర ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!