ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రెండేళ్ల నమ్మకం - సంక్షేమ అభివృద్ధి" దిశలో రాష్ట్రం

రెండేళ్ల నమ్మకం – సంక్షేమ అభివృద్ధి” దిశలో రాష్ట్రం

📰 Generate e-Paper Clip

* మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు.
* గ్రామాల్లో కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం.
కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్): రెండేళ్ల కూటమిపాలనలో సంక్షేమం అభివృద్ధి దిశలో రాష్ట్రం పరుగులు పెడుతూ ఉందని మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గౌని వారి శ్రీనివాసులు అన్నారు.
బుధవారం శాంతిపురం తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ఇంటింటికీ తిరుగుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను, అభివృద్ధిని సోన్నేగానిపల్లి గ్రామ పంచాయితీ సోన్నేగానిపల్లి గ్రామం, గుండిశెట్టిపల్లి గ్రామాలలోను, ఎం కె పురం గ్రామ పంచాయితీ ముళ్లూరు, కృష్ణాపురంలోను,మఠం గ్రామ పంచాయితీ కెపి మిట్ట, సంతూరు గ్రామాలలోను, దండికుప్పం గ్రామపంచాయితీ కొండపల్లి దండికుప్పం గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మన గ్రామాల్లో చేపట్టిన వివిధ మౌలిక వసతులు, అభివృద్ధి పనులు వివరించారు. నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు లభిస్తున్న ఉపాధి అవకాశాలు.హంద్రీ-నీవా ప్రాజెక్ట్: సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న హంద్రీ-నీవా ప్రయోజనాలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమాలలో మండల టిడిపి అధ్యక్షులు నందిగాం ఉదయ్ కుమార్ నాయుడు ప్రధాన నాయకులు, టి డి పి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!