– రాష్ట్రమొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం భాస్కరన్
నారాయణవనం ఆగస్టు0 5 (గరుడదాత్రి న్యూస్ )మెగా డీఎస్సీ పై హైకోర్ట్ మొటిక్కాయ వేసినా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు బుద్ధి రావడం లేదని రాష్ట్ర మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ భాస్కరన్ అన్నారు.బుధవారం ఎన్ భాస్కరన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంతో కాలంగా వేయి కళ్ళతో యువత ఎదురు చూసిన టీచర్ ఉద్యోగాలు రావడంతో కూటమి ప్రభుత్వనికి నిరుద్యోగులు ధన్యవాదాలు తెలిపారు అన్నారు. డీఎస్సీలో నకిలీ సర్టిఫికెట్ లతో ఉద్యోగాలు ఇచ్చారని కోర్టు లో వైకాపా పార్టీ కేసు వేస్తే , సరైన సాక్ష్యాధారాలు లేవని, బాధితులు ఎవరు కోర్టు ను ఆశ్రయించలేదని , ఈ పిటీషన్ విచారణకు అర్హత లేదని కోర్టు చెప్పిందన్నారు.ప్రభుత్వం బెదిరిస్తున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని, అలా ఉంటే వందల మంది కేసులు ఎలా వేశారని కోర్టు ప్రశ్నించడం తో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నీళ్లు నమి లారన్నారు. కష్టపడి ఉద్యోగాలు పొందిన 15,941 మందిని హింసిస్తుండడం సరికాదని నిరుద్యోగుల యందు అభద్రతాభావాన్ని రేకెత్తించడానికి వైసిపి పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ కల్పన కోసం రాత్రి పగలు కష్టపడుతుందని నిరుద్యోగుల కల నెరవేరే రోజులు ముందు ఉందని తెలిపారు. అంత వరకు వైయస్సార్సీపి పార్టీ చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. మెగా డీఎస్సీ పై బహిరంగ చర్చకు రావాలన్న మంత్రి నారా లోకేష్ సవాల్ ను ఎదుర్కోలేక అడ్డదారులు వెతుకుతున్న వైసీపీ పార్టీకి మిగిలేది పరాభవమే తప్ప ఒరిగేదేమీ లేదన్నారు.అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో సుపరిపాలన జరుగుతుండడంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, తమ ఉనికి కోసం చర్చలు, ధర్నాలు, దీక్షలు అని వైఎస్ఆర్సిపి పార్టీ నాటకాలాడుతున్నారని ఈ నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇంకెనైనా వైయస్సార్సీపి పార్టీ నాయకులు ఇకనైనా టిడిపి ప్రభుత్వం పై లేనిపోని అసత్య ఆరోపణలు ప్రచారాలు మానుకోవాలని లేనిపక్షంలో త్వరలో జరిగే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
