ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జిల్లాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియామకం

జిల్లాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియామకం

📰 Generate e-Paper Clip

* కుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పి.మునస్వామి.
* గుడిపల్లి అధ్యక్షులుగా కృష్ణప్ప గౌడు.
* రామకుప్పం అధ్యక్షులుగా వి. సుబ్రమణి.
* నియామక ఉత్తర్వులు జారీ చేసిన పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా రెడ్డి.
కుప్పం,ఆగస్టు 06 (గరుడ ధాత్రి న్యూస్): చిత్తూరు జిల్లాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రతిపాదనల మేరకు ఈ నియామకం చేపట్టారు. ఈ ఉత్తర్వులను బుధవారం విడుదల చేశారు. కుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మునస్వామి ని నియమించారు. గుడిపల్లి మండల అధ్యక్షులుగా కృష్ణప్ప గౌడ్ ను నియమించారు. రామకుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వి.సుబ్రమణి ని నియమించారు. పలమనేరు టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా ఎస్. సిరాజ్, పలమనేరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎల్ సుబ్రహ్మణ్యం లను నియమించారు. పెద్దపంజానికి శంకర్ కుమార్, బైరెడ్డిపల్లికి ఎస్. ఖాదర్బాషా, గంగవరం కు సునీత, వీకోటకు పి. నాగరాజు లను నియమించారు. గుడిపాలకు జీ సెల్వం, బంగారుపాళ్యం కు మహేష్, తవనం పల్లెకు చిరంజీవి, పూతల పట్టుకు అంబిక, యాదమర్రి కి సుధాకర్, చిన్న గొట్టిగళ్లు కు బాల నరసింహులు, పుత్తూరు టౌన్ కు వడమల ఉమాశంకర్, నగరి రూరల్ కు డి కుమార్, నగరే టౌన్ కు అలా పిచయి, వడమాల పేటకు పురుషోత్తమ రెడ్డి, వెదురుకుప్పం కు జైచంద్ర, కార్వేటి నగరం గోవర్ధన్, ఎస్ఆర్ పురం కు నరసింహారెడ్డి, పాలసముద్రంకు పుష్ప రాజ్ లను నియమించారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా: కుప్పం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునుస్వామి.కుప్పం మండలం నూలకుంట గ్రామానికి చెందిన నాకు కుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎంపిక చేసిన కుప్పం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవులు గోపికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రమేష్ బాబుకి, పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డికి, సహకరించిన నా పార్టీ మిత్రులకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తనకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, కుప్పం మండలంలో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!