* మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు.
కుప్పం,ఆగస్టు 06 (గరుడ ధాత్రి న్యూస్): యువత ప్రయోజనాలను అడ్డుకునేందుకే మెగా డీఎస్సీ పై వైసీపీ కుట్రలు చేస్తోందని మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి గౌని వారి శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మకమైన మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశారన్నారు. ఐదేళ్లపాటు జాబ్ క్యాలెండర్ల పేరుతో నిరుద్యోగులను వంచించిన జగన్ రెడ్డికి, మాట ఇస్తే మడమ తిప్పని నైజం ఉన్న చంద్రబాబు గారి నిబద్ధతకు తేడా ఏమిటో ఇక్కడే స్పష్టమైందన్నారు.ఆ నమ్మకాన్ని నిలబెడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కేవలం 150 రోజుల్లో ఎక్కడా చిన్న అవినీతి లేదా పొరపాటుకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను పూర్తి చేశారన్నారు. దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఏకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, వేలాది నిరుద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఈ అపూర్వ విజయంతో నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్న సంతోషాన్ని, కూటమి ప్రభుత్వానికి దక్కుతున్న ప్రజాదరణను జీర్ణించుకోలేని వైసీపీ ముఠా, మొదటినుంచీ కోర్టు కేసులతో నియామకాలను అడ్డుకోవాలని అనేక కుట్రలు పన్నింది.ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ ఏకంగా 335 పిటిషన్లు దాఖలు చేయించి నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడింది. వైసీపీ ఎమ్మెల్సీ వేసిన పిల్పై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది సమాజ హితం కోసం ఉండే ఒక విలువైన సాధనమని, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటే పిల్ ఉద్దేశమే దెబ్బతింటుందని తీవ్రంగా హెచ్చరించింది. స్పోర్ట్స్ కోటా పేరుతో నాటకాలాడుతున్న వైసీపీకి అసలు బాధిత అభ్యర్థులే నేరుగా కోర్టుకు ఎందుకు రావడం లేదని న్యాయస్థానం నిలదీయడం వైసీపీ కుతంత్రాలకు చెంపపెట్టు. వైసీపీ ముఠా తలకిందులుగా తపస్సు చేసినా, రాత్రింబవళ్లు శ్రమించి వెతికినా మెగా డీఎస్సీ- 2025లో ఒక్క అవినీతి మరకను కూడా చూపించలేకపోయారు. ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా యువత జీవితాలను నాశనం చేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఇస్తున్న ఉద్యోగాలను కూడా కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూడడం వారి నీచ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. ఏ ఆధారమూ లేకుండా సీబీఐ విచారణలంటూ సోషల్ మీడియాలోనూ, కోర్టుల్లోనూ నాటకాలాడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. కోర్టుల పేరు చెప్పి నియామకాల ప్రక్రియను ఆలస్యం చేయాలని, నిరుద్యోగులను మళ్లీ రోడ్డుపైకి నెట్టాలని చూస్తున్నారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను, పరీక్ష రాసిన యువతను గందరగోళానికి గురిచేసి వారి భవిష్యత్తుతో ఆడుకోవడమే వైసీపీ ఏకైక ఎజెండా. పరీక్షల నిర్వహణ నుండి ఫలితాల వరకు ప్రతి అంశంపై అబద్ధాలు ప్రచారం చేస్తూ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉద్యోగం వచ్చిందనే సంతోషంలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలలో ఆనందం లేకుండా చేయాలని చూస్తున్నారు.రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించినా, యువతకు ఉద్యోగాలు వచ్చినా తట్టుకోలేని నైజం వారిది. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయక, ఇప్పుడు మంచి జరుగుతుంటే అడ్డుపడుతున్న వైసీపీ తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారు. వైసీపీ చేస్తున్న బూటకపు పోరాటం నిరుద్యోగుల కోసం కాదు, కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే. వైసీపీకి విద్యారంగం గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడే కనీస నైతిక హక్కు లేదు. జగన్ పాలనలో జీఓ-117 తెచ్చి ఉపాధ్యాయులను వేధించి, విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. విద్యాకానుక కిట్లలో, నాశిరకం ట్యాబులలో, స్కూల్ బ్యాగుల టెండర్లలో వందల కోట్లు దోచుకున్న ఘోర చరిత్ర జగన్ దని ఆరోపించారు. చివరికి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఎగొట్టి, పాలు, గుడ్ల సరఫరాదారులకు వందల కోట్ల బిల్లులు ఎగ్గొట్టినది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు.చట్టాన్ని, రాజ్యాంగాన్ని తమ రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవాలని చూసిన వైసీపీకి హైకోర్టు ఇచ్చిన మొట్టికాయలతోనైనా బుద్ధి వస్తుందో లేదో చూడాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీని నిర్వహించి నిజమైన ప్రతిభకు పట్టంగట్టింది.తమ కష్టాన్ని నాటకంగా చిత్రీకరిస్తూ రాజకీయాలు చేస్తున్న వైసీపీని రాష్ట్రంలో చిరునామా లేకుండా చేయడానికి యువత సిద్ధమయ్యారు.పారదర్శకంగా జరిగిన నియామకాలపై అబద్దాలు ప్రచారం చేస్తున్న వైసీపీకి రాబోయే రోజుల్లో నిరుద్యోగులు, వారి కుటుంబాల చేతుల్లో ఓటమి తప్పదు. ఉద్యోగాలు ఇస్తుంటే అడ్డుపడేందుకు కోర్టుల చుట్టూ తిరిగిన వైసీపీ నేతలకు 2029 ఎన్నికల్లో నిరుద్యోగ యువతే తరిమి తరిమి కొట్టి సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
యువత ప్రయోజనాలను అడ్డుకునేందుకే మెగా డీఎస్సీపై వైసీపీ కుట్రలు
RELATED ARTICLES
