ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆలయం వద్ద మరుగుదొడ్లు నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తా

ఆలయం వద్ద మరుగుదొడ్లు నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తా

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం 8 (గరుడదాద్రి న్యూస్)
కార్వేటి నగరం మేజర్ పంచాయతీ కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి వారి దేవస్థానంలో ఆడి కృత్తిక సందర్భంగా జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ తరఫున,
జనసేన పార్టీ ఆధ్వర్యంలో 10 మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడతామని డాక్టర్ యుగంధర్ పొన్న హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ రాఘవ రాయల్, బిసి సెల్ చిత్తూరు జిల్లా యువజన అధ్యక్షులు మాడసి వెంకటేష్, ఎస్.ఆర్.పురం మండల ఐటీ కోఆర్డినేటర్ మురుగేశన్, ఆలయ డైరెక్టర్ కె. సెల్వి, తులసి, గోవిందస్వామి, ఆలయ ఈవో కృష్ణ నాయక్, సీనియర్ టిడిపి నాయకులు రాంబాబు రెడ్డి, మాజీ టౌన్ కమిటీ అధ్యక్షులు జగన్నాథం, టిడిపి నాయకులు హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!