ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యం

కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 8 (గరుడదాద్రి న్యూస్)
గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనులు చేపడుతున్నారని మండల పార్టీ అధ్యక్షులు చంగల్రా యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా అన్నారు. గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ ఆదేశాల మేరకు క్లస్టర్ (6) లోని 116,117,120,121,122 బూత్ లలోని బూత్ కన్వీనర్లతో కలిసి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరములలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి “డోర్ టు డోర్ టిడిపి” కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలల్లో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి జరిగిందన్నారు. ప్రభుత్వంలో పేదల అభివృద్ధి సంక్షేమం జరిగిందన్నారు, క్లస్టర్ ఇంచార్జ్ (6) మరియు వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.రాజేంద్రరెడ్డి, (17)వ యూనిట్ ఇంచార్జ్ గిరీష్ రెడ్డి, జాండ్లపేట గ్రామ పంచాయితీ పార్టీ నాయకులు సాంబశివ నాయుడు, చంద్రశేఖర్ , బూత్ కమిటీ సభ్యులు కాంతారావు, ముని చంద్ర రెడ్డి, గాదంకి పంచాయతీ అమ్మవారి గుంట గ్రామం బూత్ కమిటీ సభ్యులు లక్ష్మీపతి, గ్రామ కమిటీ అధ్యక్షులు కళావతి, మల్లికార్జున రెడ్డి, కృష్ణారెడ్డి, తరుణ్, రాజేష్ మరియు ముక్కరవానిపల్లి బూత్ కన్వీనర్ మురళి పాల్గొన్నారు. జాండ్లపేట, ముక్కారవానిపల్లి, గాజంకి బూత్ కన్వీనర్లకు మై టిడిపి ఆప్ గురించి అవగాహన కల్పించి, ప్రజల ఇంటి వద్దకే వెళ్లి డోర్ టు డోర్ కరపత్రాలను అందజేసి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలలో అవగాహన కల్పించు కార్యక్రమాన్ని బూత్ కన్వీనర్లకు వివరించి ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!