ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్దేవరకొండ పై సుబ్రమణ్యస్వామి కి శయనోత్సవం తో ముగిసిన ఆడికృతిక మహోత్సవం వేడుకలు

దేవరకొండ పై సుబ్రమణ్యస్వామి కి శయనోత్సవం తో ముగిసిన ఆడికృతిక మహోత్సవం వేడుకలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు8

బైరెడ్డిపల్లి మండలం లోని నెల్లిపట్ల గ్రామంలో దేవరకొండ పై వెలిసివున్న శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామికి శయణోత్సవం నిర్వహించడంతో ఆడికృతిక మహోత్సవం వేడుకలు ముగిసింది.ఉదయం స్వామి కి పంచామృత అభిషేకం అర్చకులు సుబ్రమణ్యం శాస్త్రి బృందం చే కొనసాగింది. మధ్యాహ్నం శాస్త్రోక్తంగా 12 మంగళహారతులు కార్యక్రమం, వసంతోత్సవం చేపట్టారు.రాత్రి
శ్రీ వల్లీ,దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి ఉత్సవ మూర్తులకు పట్టువస్త్రాలు ధరింపచేసి విశేష అలంకారం చేపట్టి సంప్రదాయం ప్రకారం శయనోత్సవం వేడుకలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉభయదార్లు, భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం దాతలు చేయూత తో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామి ఆషాడ ఆడికృతిక మహోత్సవం వేడుకలు విజయవంతం చేసినందుకు దాతలు,ఉభయదార్లు, గ్రామస్థులకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!