ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పలమనేరులో '30 పోలీస్ యాక్ట్' అమలు

పలమనేరులో ’30 పోలీస్ యాక్ట్’ అమలు

📰 Generate e-Paper Clip

అనుమతి లేని ర్యాలీలు, సభలపై కఠిన చర్యలు!

పలమనేరు, ఆగస్టు 09 ( గరుడ ధాత్రి ) :
పట్టణంలో ప్రజా శాంతి, భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణను దృష్ట్యా పలమనేరు పట్టణ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పలమనేరు డిఎస్పీ డేగల ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పట్టణంలో ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి తప్పనిసరి: ఏదైనా సభలు, సమావేశాలు లేదా ఊరేగింపులు నిర్వహించాల్సి వస్తే, సంబంధిత పోలీస్ అధికారుల నుండి ముందస్తుగా రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరి తెలిపారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించి ప్రజలకు, వాహనాల రాకపోకలకు, సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయిన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
పలమనేరు పట్టణ ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు మరియు వివిధ సంస్థల నాయకులు పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో సహకరించి, శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని డిఎస్పీ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!