ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గరుడధాత్రి ఎఫెక్ట్.. స్పందించిన విద్యుత్ అధికారులు

గరుడధాత్రి ఎఫెక్ట్.. స్పందించిన విద్యుత్ అధికారులు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం, ఆగస్టు 09 గరుడధాత్రి:

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమైన ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై “విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పలు ఇళ్లలో టీవీలు దగ్ధం” అనే శీర్షికతో శనివారం గరుడధాత్రి తెలుగు దినపత్రికతో పాటు గరుడధాత్రి వెబ్ న్యూస్‌లో వార్త ప్రచురితమైంది.
కార్వేటినగరం మండలం గాజంకి పంచాయతీ పరిధిలోని పల్లాలు ఇండ్లు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు కుటుంబాలకు చెందిన టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. దీంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి.
వార్తా కథనంపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం గ్రామాన్ని సందర్శించి, బాధితుల ఇళ్ల వద్ద విద్యుత్ లైన్లను పరిశీలించారు. లోపాలను గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు.
తమ సమస్యపై వెంటనే స్పందించి గ్రామానికి వచ్చి విద్యుత్ లైన్లను మరమ్మతు చేసిన అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన గరుడధాత్రికు కూడా గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏడీఈ చంద్రబాబు, ఏఈ నాదమునితో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!