ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకం నిత్య అన్నదాన, గో సంరక్షణ ట్రస్టులకు రూ.1.10 లక్షల విరాళం

కాణిపాకం నిత్య అన్నదాన, గో సంరక్షణ ట్రస్టులకు రూ.1.10 లక్షల విరాళం

📰 Generate e-Paper Clip

కాణిపాకం, ఆగస్టు 9 (గరుడధాత్రి న్యూస్):
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానానికి బెంగళూరుకు చెందిన దీపికారాణి కుటుంబ సభ్యులు రూ.1.10 లక్షల విరాళాన్ని అందజేశారు.
దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.59,999, గో సంరక్షణ ట్రస్టుకు రూ.50,001 చొప్పున మొత్తం రూ.1,10,000 విరాళంగా సమర్పించారు.
ఈ సందర్భంగా దీపికారాణి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!