మహిళఏఎస్ఐ జ్యోతిని గాయపరచడం దుర్మార్గపు చర్య
పూతలపట్టు ఆగస్టు 10 (గరుడ దాత్రి న్యూస్) రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ పై మాట్లాడే నైతిక హక్కు వైసిపి నేతలకు లేదని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. సోమవారం ఆయన పూతలపట్టు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ తో 16 వేల మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందన్నారు
విద్యాశాఖ మంత్రి డీఎస్సీ పరీక్షలను పగడ్బందీగా రాష్ట్రమంతా నిర్వహించి ఆన్లైన్ ద్వారానే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగులు ఇవ్వడం జరిగిందని. రాష్ట్రంలోరాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకున్నారన్నారు దీనిలో ఎలాంటి విపచ్చలేదని తెలిపాడు. నిజంగానే డీఎస్సీలో అవకతవకలు జరిగి ఉంటే డీఎస్సీ ఉపాధ్యాయులు న్యాయం చేయండి అని అడగాలని వాళ్లకి నిష్పక్షపాతంగా ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి వాళ్లు ఉద్యోగలు చేసుకుంటూ ఉన్నారన్నారు. ఉద్యోగాలు వచ్చిన వారిలో వైసిపి పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని గుర్తు చేశాడు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ల నాయకులు రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవాలని డీఎస్సీని ఎంచుకొని తప్పుడు విధానాలతో మూడు రోజులపాటు నిరాహార దీక్షలు చేయడం జరిగింది అన్నారు. వైసిపి పార్టీని ప్రజలే దూరం పెట్టారని అది వారుగుర్తుచేసుకోవాలన్నారు. దీనిపైన వైసీపీ నాయకులు హైకోర్టుకెళ్లిన హైకోర్టులో కూడా చివాట్లు పడ్డాయని గుర్తు చేశాడు. వైసిపి హయాంలో అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టించారని ఏపీపీఎస్సీ వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని కూడా బ్రష్టు పట్టించాలని నానతండాలు పడుతూ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ఇలాంటి దీక్షలు ధర్నాలు ప్రజలు యువకులు నమ్మబోరని ఆయన దుయ్య పట్టారు.రాష్ట్రంలో ప్రజలకుమంచిజరుగుతుంటే ప్రోత్సహించాలి గాని ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం వైసిపి పార్టీకి మామూలే అన్నారు. నిజంగా డీఎస్సీలో అక్రమాలు జరిగి ఉంటే వైసీపీ నాయకులు ఒక అభ్యర్థిని అయిన తీసుకుని వచ్చి ఈ అభ్యర్థికి అన్యాయం జరిగిందని చెప్పాలని ఆయన సవాల్ విసిరాడు. ఏఎస్ఐ జ్యోతి నీ గాయపరిచిన వైసిపి నాయకులు పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి తెలియజేశానని ఎమ్మెల్యే తెలిపాడు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టిడిపి కన్వీనర్ దొరబాబు చౌదరి. మాజీ కన్వీనర్ చంద్రమౌళి. బిజెపి అధ్యక్షుడు ప్రసాద్.జనసేన అధ్యక్షుడు మనోహర్. సింగల్ విండో అధ్యక్షులు ఇంద్రసేన నాయుడు. జగన్నాథం. కాణిపాకం బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు.నాయకులు ఉప్పలపాటి బాబురావు. గంగారపు గోపి.గుంటూరు మురళి నాయుడు. పెద్ద పాల్యం నాగరాజు. ఏకాంబరం.రెడ్డప్ప నాయుడు. గోపి యాదవ్.ప్రవీణ్ కుమార్. తదితరులు పాల్గొన్నారు
