ఏడు పదులు దాటినా అలుపెరగని రాజకీయ ప్రయాణం_ ఒక తరం రాజకీయ విలువలకు ప్రతిబింబం రామంజుల నాయుడు
పదవుల కోసం కాదు.. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసిన నిస్వార్థ పసుపు సైనికుడు
రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ విలువలు, నిబద్ధత, టీడీపీ పార్టీ పట్ల అచంచల విశ్వాసం మాత్రం తరతరాలకు గుర్తుండిపోతాయి. అలాంటి అరుదైన రాజకీయ ప్రస్థానానికి నిలువెత్తు నిదర్శనం కేవీబీపురం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు రామానుజుల నాయుడు.
ఏడు పదులు దాటిన వయసులోనూ రాజకీయంగా చురుగ్గా కొనసాగుతూ, దశాబ్దాలుగా పార్టీ జెండాను మోస్తున్న ఆయన ప్రస్థానం స్థానిక రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. యుక్తవయసులోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న రామానుజుల నాయుడు, 1978లో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబ రాజకీయ ప్రస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని రెడ్డి కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఆయన అనుచరులు గుర్తుచేస్తున్నారు.
ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై టీడీపీ జెండా భుజాన..
1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన వెంటనే, దివంగత ఎన్టీ రామారావు పట్ల ఉన్న అభిమానంతో రామానుజుల నాయుడు టీడీపీ జెండాను భుజాన వేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి నేటి వరకు పార్టీ పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తూ వస్తున్న ఆయనను స్థానికులు నిక్కచ్చి కార్యకర్త,నిస్వార్థ నాయకుడు,పసుపు సైనికుడు గా అభివర్ణిస్తున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కేవీబీపురం మండలం ఉన్న సమయంలోనూ, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సత్యవేడు నియోజకవర్గంలో చేరిన తర్వాత కూడా ఆయన పార్టీ కోసం నిరంతరం పనిచేశారని అనుచరులు చెబుతున్నారు.
16 ఏళ్ల పాటు మండల అధ్యక్షుడిగా..
రామానుజుల నాయుడు రాజకీయ ప్రస్థానంలో మరో ముఖ్య ఘట్టం 16 సంవత్సరాల పాటు టీడీపీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడం. దీర్ఘకాలం పార్టీ మండల అధ్యక్షుడిగా కొనసాగినప్పటికీ, పదవిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా పార్టీ సిద్ధాంతాలు, అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పనిచేశారనే పేరును సంపాదించుకున్నారు.
ముందు పార్టీ.. ఆ తర్వాతే వ్యక్తిగత ప్రయోజనాలు
అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు పేర్కొంటున్నారు.
పదవులపై ఆశ లేదు.. పార్టీపై మమకారమే ఆస్తి
రాజకీయాల్లో పదవుల కోసం పోటీ పడే ధోరణి పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రామానుజుల నాయుడు మాత్రం పదవుల కంటే పార్టీని, పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అభిమానులు చెబుతున్నారు. అధిష్టానం ఆదేశాలను, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ రాజకీయ హుందాతనంతో వ్యవహరించడం ఆయన ప్రత్యేకతగా పేర్కొంటున్నారు.
మారుతున్న రాజకీయాల్లోనూ చెక్కుచెదరని హుందాతనం
ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు, పదవులు, ఆధిపత్యం కోసం పోటీ పెరుగుతున్న నేపథ్యంలో దశాబ్దాలుగా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకుల పాత్రపై చర్చ జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లోనూ రామానుజుల నాయుడు తన రాజకీయ హుందాతనాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు.
స్థానికంగా పార్టీ బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాలు, వ్యూహాలు, సలహాలు, కార్యకర్తల సమన్వయం వంటి అంశాల్లో సీనియర్ నాయకుల అనుభవాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రాజకీయ అనుభవానికి ఓ చిరునామా..
దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని సొంతం చేసుకున్న రామానుజుల నాయుడు ప్రస్థానం కేవలం ఒక వ్యక్తి రాజకీయ ప్రయాణం మాత్రమే కాదని, ఒక తరం రాజకీయ విలువలకు ప్రతిబింబమని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.
~~~~~~~~~~~~~~~~
జెండా మారలేదు.. నిబద్ధత మారలేదు.. సిద్ధాంతం మారలేదు..
1978లో ప్రారంభమైన రాజకీయ ప్రయాణం నుంచి నేటి వరకు పార్టీ పట్ల కొనసాగుతున్న ఆయన విశ్వాసం, నిస్వార్థ సేవ, సుదీర్ఘ అనుభవం కేవీబీపురం రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.
~~~~~~~~~~~~~~~~
పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకుడిగా, యువతరానికి రాజకీయ విలువలను పరిచయం చేసే మార్గదర్శిగా రామానుజుల నాయుడు ప్రస్థానం చరిత్రలో నిలిచిపోయే ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
*ఏది ఏమైనా*
రాజా…. రామాంజుల నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోండి… మీకు అర్థం అవుతుందా రాజా….
రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు అభియోగాలు అన్ని ఉంటాయి సహనం సమన్వయం… హుందాగా వ్యవహరించే తత్వం… ఉండాలి… పొగడ్తలనే కాదు విమర్శలను సైతం స్వీకరించి సరిదిద్దుకోగలిగే ఆలోచనలతో ముందుకు వెళితే…. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్తే….పార్టీ క్రమశిక్షణను శిరసా వహిస్తే…. ప్రజలు ఆమోదిస్తారు రాజా… ప్రజా ఆమోదానికి ప్రతిబింబమే రామానుజల నాయుడు రాజా…
దాన్ని అర్ధాన్ని మార్చి స్వార్థానికి ఉపయోగించిన వాళ్ళు…. కాలగర్భంలో కలిసిపోయారు రాజా… అర్థమవుతుందా…..
పార్టీ పార్టీ తరపున ప్రతినిధిని పార్టీ నాయకుడిని కార్యకర్తను ప్రజల్లోకి పంపినప్పుడు… అతని విలువలను చూసి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న క్రమశిక్షణను చూసి
ప్రజలు ఆమోదిస్తారు..
తద్వారా ప్రస్థానం ప్రారంభమవుతుంది…..
రాజకీయాలలో అసహనం పనికిరాదు మనుగడ కష్టం…. ప్రస్థానం ప్రారంభం కాకముందే ఆవిరి అయిపోతుంది… (రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ)
