ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

సత్యవేడు ఆగస్టు 15 గరుడధాత్రి:

దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహులు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!