ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎస్ఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎస్ఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు ఆగస్టు 15 గరుడధాత్రి :
దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా పిచ్చాటూరు మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సై బి. రాఘవేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎస్సై బి. రాఘవేంద్ర మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని, దేశ ప్రజల రక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు.
అనంతరం పోలీస్ సిబ్బంది పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!