ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు ఆగస్టు 15 గరుడధాత్రి:

జాతీయ స్ఫూర్తి, దేశభక్తి భావాలు వెల్లివిరిసేలా పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి, దేశభక్తి, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఉపాధ్యాయులు సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!