ePaper
Monday, August 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఈనెలలో రెండుసార్లు స్వామివారి గరుడ వాహన సేవ

ఈనెలలో రెండుసార్లు స్వామివారి గరుడ వాహన సేవ

📰 Generate e-Paper Clip

ఆగస్టు 17న గరుడ పంచమి

28వ తేదిన శ్రావణ పౌర్ణమి

తిరుమ‌ల‌లో ఆగస్టు 17వ తేదీ సోమ‌వారంనాడు గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు.

ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి గ‌రుడ సేవ‌

తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గ‌రుడ‌వాహ‌నంపై శ‌నివారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!