ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కూటమి ప్రభుత్వ పాలనలోనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమం ఫలాలు

కూటమి ప్రభుత్వ పాలనలోనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమం ఫలాలు

📰 Generate e-Paper Clip

ఐరాల ఆగస్టు 16(గరుడ దాత్రి న్యూస్)

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతున్నాయని ఐరాల మండలం మాజీ టీడీపీ అధ్యక్షులు బత్తల సురేంద్ర నాయుడు అన్నారు.
“రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’* ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఐరాల మండలం పొలకల పంచాయతీలోని రెడ్డివారిపల్లె ఎగువ హరిజనవాడ, దిగువ హరిజనవాడ, సల్లావాండ్ల పల్లె, గుడిపల్లె, గుడిపల్లె హరిజనవాడ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అమలు చేసిన సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ హామీల అమలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ వై క్రిష్ణ మూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు బి. రవీంద్ర నాయుడు, దళిత నాయకులు చంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!