ఐరాల కాణిపాకం ఆగస్టు 16 (గరుడ ధాత్రి న్యూస్)
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తులకు, ఆలయానికి ఉత్తమ సేవలు అందిస్తున్న హరి స్వామి, గిరిబాబులను దేవస్థానం ఈవో పెంచల కిషోర్ అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో సేవలందిస్తున్న వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. వారి సేవలు ఇతర సిబ్బందికి స్ఫూర్తిదాయకమని ఈవో పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం ఇదే విధమైన నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా హరి స్వామి, గిరిబాబులను సిబ్బంది అభినందించారు.
