ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పం పురపాలక పరిధిలో అభివృద్ధి పనులకు 60 కోట్ల మంజూరు

కుప్పం పురపాలక పరిధిలో అభివృద్ధి పనులకు 60 కోట్ల మంజూరు

📰 Generate e-Paper Clip

* కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి.శ్రీనివాసరావు.
కుప్పం,ఆగస్టు 20(గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసిందని కుప్పం పులపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన మంజూరైన అభివృద్ధి పనుల వివరాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 60 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయిందన్నారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు అయిందన్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 53 కోట్లు, తారు రోడ్డు నిర్మాణానికి 1.86 కోట్లు మంజూరు అయింది అన్నారు.1.36 ఎకరాల్లో ఉద్యానవనాల అభివృద్ధికి5.15 కోట్ల రూపాయలు మంజూరు అయిందన్నారు. త్వరలోనే పనులకు టెండర్లను ఆహ్వానించడం జరుగుతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!