ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జి.శంకర్ ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

జి.శంకర్ ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

📰 Generate e-Paper Clip

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ

బి.కొత్తకోట సెప్టెంబర్ 4:(గరుడ ధాత్రి న్యూస్)
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని,వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో శుక్రవారం తంబాలపల్లి తాలూకా పిటిఎం మండల పరిధిలోని వినాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన జి.శంకర్ ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జి.శంకర్ దృష్టికి తీసుకెళ్లారు.ప్రజా దర్బార్‌లో ప్రధానంగా రోడ్లు,డ్రైనేజీ, తాగునీరు,విద్యుత్,పింఛన్లు, రేషన్ కార్డులు,ప్రభుత్వ సంక్షేమ పథకాలు,వ్యక్తిగత సమస్యలు తదితర అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు.ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విన్న జి.శంకర్,సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వమే తన లక్ష్యమని జి.శంకర్ తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయడంతో పాటు,ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.ప్రజా దర్బార్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను వివరించడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు చూపుతున్న జి.శంకర్ తీరుపై పలువురు ప్రజలు అభినందనలు వ్యక్తం చేశారు.“ప్రజల సమస్యలే నా సమస్యలు”ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తానని జి.శంకర్ స్పష్టం చేశారు.ప్రజా దర్బార్‌లను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాలూకా లోని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు శంకర అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!