బంగారుపాలెం సెప్టెంబర్ 12 గరుడ దాత్రి న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం శేషాపురం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు గుడివాడ మురళినాయుడు కుమారుడు ఎన్నారై గుడివాడ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన స్వంత గ్రామంలో పేదలకు బట్టలు పంపిణీ చేశారు.ముందుగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకొని తన స్వగ్రామానికి చేరుకొని తన స్వగృహం వద్ద పేదలకు బట్టలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,స్నేహితులు, శ్రేయోభిలాషులు,గ్రామస్తులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
