చౌడేపల్లి సెప్టెంబర్ 13 గరుడ దాత్రి న్యూస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిల జన్మదిన వేడుకలు పుంగనూరు నియోజకవర్గంలో ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ బోయకొండ దేవస్థానం చైర్మన్ ఎస్.కె. వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు మాదిరాజు లక్ష్మణరాజు, పతిరాజుల మార్గదర్శకత్వంలో చౌడేపల్లి బస్టాండ్ ఆవరణలో స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులు, పేదలు మరియు స్థానికులకు పెద్ద సంఖ్యలో ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నల్లారి కుటుంబానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పునాదులు వేసిన ఘనత ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు, ‘బంగారు తల్లి’ వంటి పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ ప్రజాదరణ పొందుతున్నాయన్నారు పీలేరు ఎమ్మెల్యేగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు శ్రమిస్తున్నారు. మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, తాగు-సాగు నీటి సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించడమే నల్లారి సోదరుల నైజమని నేతలు కొనియాడారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో ఉన్నత పదవులను అధిష్టించి ప్రజలకు సేవ చేయాలని స్థానిక నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల స్థాయి టిడిపి నాయకులు సింగిల్ విండో చైర్మన్ హరి రాయల్ నాయకులు వేలూరు సుబ్రహ్మణ్యం పవన్ కుమార్ కార్తీక్ సాగర్ నాయుడు చంగల్ రాయుడు రామకృష్ణ మల్లాపురం నరేష్ శివప్ప నాయుడు అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
