ఆధ్యాత్మికతకు, భారతీయ సంస్కృతికి ప్రతీక గురుపూజోత్సవం
-చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తినాని,మురళీమోహన్
తిరుపతి సెప్టెంబర్ 13 గరుడదాత్రిన్యూస్ :
తిరుపతిలోని శిల్పారామంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అతిథులుగా పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని శిల్పారామానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు ఉపాధ్యాయులు సాదర స్వాగతం పలికారు. మాజీ రాష్ట్రపతి, గురువులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి, ఘన నివాళులర్పించారు.అనంతరం జరిగినగురుపూజోత్సవ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు.
ఆధ్యాత్మికతకు, భారతీయ సంస్కృతికి ప్రతీక గురుపూజోత్సవమన్నారు”గురువు లేని జీవితం దీపం లేని ఇంటితో సమానం. భారతీయ సంప్రదాయంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత అత్యున్నత స్థానం ఉంది. నేటి యువత గురువులను గౌరవిస్తూ, వారు చూపిన మార్గంలో నడవాలి. విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పేది గురువే” అని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుఅన్నారు.చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ
“గురుపూజోత్సవం అనేది కేవలం ఒక వేడుక కాదు, అది మన కృతజ్ఞతకు నిదర్శనం. ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక గురువు కృషి ఉంటుంది. సమాజ నిర్మాణంలో గురువుపాత్రఅమోఘమైనది. గురువుల ఆశీర్వాదంతోనే మనం ఉన్నత శిఖరాలను అధిరోహించగలం” అని ఆయనపేర్కొన్నారు.పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్మాట్లాడుతూగురుబ్రహ్మ, గురుర్విష్ణుః అన్న నానుడికి అనుగుణంగా గురువును దైవంగా భావించడం మన సంస్కృతి. విద్యార్థుల భవిష్యత్తునుతీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చిరస్మరణీయం.గురుపూజోత్సవంద్వారాభావితరాలకు గురువువిలువతెలియజేయాలి” అని ఎమ్మెల్యే మురళీమోహన్అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలుఆహుతులను అలరించాయి.ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్ జ్ఞాపికలతో సత్కరించి, గౌరవించారు..
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాలలఉపాధ్యాయులు,విద్యార్థులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
