తిరుపతి, సెప్టెంబరు 13 గరుడధాత్రి:
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకాంక్షించారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, తిరుపతి జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజలందరూ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పర్యావరణహితమైన వినాయక విగ్రహాలను వినియోగిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో నిర్వహించాలని సూచించారు.
తిరుపతి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు – కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
RELATED ARTICLES
