ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక విడుదల

పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక విడుదల

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 15 ( గరుడదాద్రి న్యూస్):

*పాఠశాల యాజమాన్య కమిటీల పునర్వ్యవస్థీకరణ ఎన్నికల షెడ్యూల్ విడుదల*
• అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 29న ఎన్నికలు
• సక్రమంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన “SMC మార్గదర్శకాలు – 2026” ఆధారంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీల (SMC) పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.

*ఎన్నికల షెడ్యూల్ వివరాలు*
• 15.09.2026: SMC సభ్యులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల (ఉదయం 10:00 గంటలకు).
• 18.09.2026: పాఠశాల నోటీస్ బోర్డుపై ఓటర్ల జాబితా ప్రదర్శన (మధ్యాహ్నం 2:00 గంటలకు).
• 25.09.2026: ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం (ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు).
o తుది ఓటర్ల జాబితా ఖరారు, ప్రదర్శన (మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 4:00 వరకు).
o 29.09.2026: SMC సభ్యుల ఎన్నిక నిర్వహణ, ఖరారు (ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు).
o చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక (మధ్యాహ్నం 1:30 గంటలకు).
o ప్రమాణ స్వీకారోత్సవం (మధ్యాహ్నం 2:00 గంటలకు).
o నూతన SMC మొదటి సమావేశం (మధ్యాహ్నం 3:00 నుండి 3:30 వరకు).

ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ఆయా జిల్లాల ప్రాంతీయ విద్యా శాఖ సంయుక్త సంచాలకులు (RJDSEs), జిల్లా విద్యాశాఖాధికారులు (DEOs), సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు (APCs) తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు ఆదేశించారు. డిప్యూటీ ఈఓలు, సెక్టోరల్ అధ

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!