తిరుమల,సెప్టెంబర్ 15 గరుడధాత్రి :
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన మంగళవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా గౌ|| ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు, టీటీడీ కార్య నిర్వహణాధికారి ముద్దాడ రవికుమార్, స్వాగతం పలికారు. అనంతరం గౌ. ముఖ్యమంత్రి ధ్వజ స్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని అందజేశారు.
గౌ. ముఖ్యమంత్రి గారి వెంట జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పి ఎల్.సుబ్బరాయుడు, ఆడిసినల్ ఈ ఓ వెంకయ్య చౌదరి, సివీఎస్వో మురళి కృష్ణ,ఎస్ వి బి సి చైర్మన్ శ్రీధర్ వర్మ, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు
